ప|| అన్నిటా నేరుపరి హనుమంతుడు | పిన్ననాడే రవినంటె పెద్ద హనుమంతుడు ||
చ|| ముట్టిన ప్రతాపపు రాముని సేనలోన | అట్టె బిరుదు బంటు హనుమంతుడు |
చుట్టిరానుండినట్టి సుగ్రీవు ప్రధానులలో | గట్టియైనలావరి చొక్కవు హనుమంతుడు ||
చ|| వదలక కూడినట్టి వనచర బలములో | నదె యేకాంగ వీరుడు హనుమంతుడు |
చెదరక కుంభకర్ణు చేతి శూల మందరిలో | సదరాన విరిచె భీషణ హనుమంతుడు ||
చ|| త్రిజగముల లోపల దేవతా సంఘములోన | అజుని పట్టాన నిలిచె హనుమంతుడు |
విజయనగరాన శ్రీ వేంకటేశు సేవకుడై | భుజబలుడై యున్నాడిపుడు హనుమంతుడు ||
pa|| anniTA nErupari hanumaMtuDu | pinnanADE ravinaMTe pedda hanumaMtuDu ||
ca|| muTTina pratApapu rAmuni sEnalOna | aTTe birudu baMTu hanumaMtuDu | cuTTirAnuMDinaTTi sugrIvu pradhAnulalO | gaTTiyainalAvari cokkavu hanumaMtuDu ||
ca|| vadalaka kUDinaTTi vanacara balamulO | nade yEkAMga vIruDu hanumaMtuDu | cedaraka kuMBakarNu cEti SUla maMdarilO | sadarAna virice BIShaNa hanumaMtuDu ||
ca|| trijagamula lOpala dEvatA saMGamulOna | ajuni paTTAna nilice hanumaMtuDu | vijayanagarAna SrI vEMkaTESu sEvakuDai | BujabaluDai yunnADipuDu hanumaMtuDu ||