ప|| అన్నిటా భాగ్యవంతుడవుదువయ్యా | పన్నినందుకల్లా వచ్చు భామ నీకు నిపుడు ||
చ|| పడాతి మోహరసము పన్నీటి మజ్జనము | కడలేని యాపెసిగ్గు కప్పురకాపు |
నిడుద కన్ను చూపులు నించిన తట్టు పునుగు | తొడిబడ సులభాన దొరకె నీకిపుడు ||
చ|| కామిని కెమ్మోవికాంతి కట్టుకొనే చంద్రగావి | ఆముకొన్న మోహకళలాభరణాలు |
దోమటి మాటల విందు ధూప దీప నైవేద్యాలు | కామించి నటువలెనె కలిగె నీకిపుడు ||
చ|| అలమేలుమంగ నవ్వులంగపు నవ్వు దండలు | కలసి వురాన నీకే కట్టిన తాళి |
చలపట్టి యీకె రతి సకల సంపదలు | యిలవచ్చె శ్రీవేంకటేశ నీకు నిపుడు ||
pa|| anniTA BAgyavaMtuDavuduvayyA | panninaMdukallA vaccu BAma nIku nipuDu ||
ca|| paDAti mOharasamu pannITi majjanamu | kaDalEni yApesiggu kappurakApu |
niDuda kannu cUpulu niMcina taTTu punugu | toDibaDa sulaBAna dorake nIkipuDu ||
ca|| kAmini kemmOvikAMti kaTTukonE caMdragAvi | Amukonna mOhakaLalABaraNAlu | dOmaTi mATala viMdu dhUpa dIpa naivEdyAlu | kAmiMci naTuvalene kalige nIkipuDu ||
ca|| alamElumaMga navvulaMgapu navvu daMDalu | kalasi vurAna nIkE kaTTina tALi | calapaTTi yIke rati sakala saMpadalu | yilavacce SrIvEMkaTESa nIku nipuDu ||