ప|| అన్నిటా శాంతుడైతే హరిదాసుడు దానే | సన్నుతి దానేపో సర్వదేవమయుడు ||
చ|| అత్తల మనసు యింద్రియాధీనమైతేను | చిత్తజుడనెడివాడు జీవుడు దానే |
కొత్తగా తనమనసే కోపాన కాధీనమైతే | తత్తరపు రుద్రుడును దానే తానే ||
చ|| భావము వుద్యోగములప్రపంచాధీనమైతే | జీవుడు బ్రహ్మాంశమై చెలగు దానే |
కావిరి రేయిబగలు కన్నుల కాధీనమైతే | ఆవల జంద్రసూర్యాత్మకుడుదానే ||
చ|| కోరిక దనబ్రదుకు గురువాక్యాధీనమైతే | మోరతోపులేని నిత్యముక్తుడు దానే |
ఆరయ శ్రీవేంకటేశు డాతుమ ఆధీనమైతే | ధారుణిలో దివ్యయోగి తానే తానే ||
pa|| anniTA SAMtuDaitE haridAsuDu dAnE | sannuti dAnEpO sarvadEvamayuDu ||
ca|| attala manasu yiMdriyAdhInamaitEnu | cittajuDaneDivADu jIvuDu dAnE | kottagA tanamanasE kOpAna kAdhInamaitE | tattarapu rudruDunu dAnE tAnE ||
ca|| BAvamu vudyOgamulaprapaMcAdhInamaitE | jIvuDu brahmAMSamai celagu dAnE | kAviri rEyibagalu kannula kAdhInamaitE | Avala jaMdrasUryAtmakuDudAnE ||
ca|| kOrika danabraduku guruvAkyAdhInamaitE | mOratOpulEni nityamuktuDu dAnE | Araya SrIvEMkaTESu DAtuma AdhInamaitE | dhAruNilO divyayOgi tAnE tAnE ||