ప|| అన్నిటాను హరిదాసు లధికులు | కన్నులవంటివారు కమలజాదులకు ||
చ|| అందరును సమమైతే నరుహానరుహము లేదా | అందరిలో హరియైతే నౌగాక |
బొందితో విప్రునిదెచ్చి పూజించినట్టు వేరే- | పొందుగానిశునకము బూజింపదగునా ||
చ|| అన్నిమతములు సరియైతేను వాసిలేదా | చెన్నగుబురాణాలు చెప్పుగాక |
యెన్నగ సొర్ణాటంక మింతటాను జెల్లినట్లు | సన్నపుదోలుబిళ్ళలు సరిగా జెల్లునా ||
చ|| గక్కున బైరు విత్తగా గాదము మొరచినట్లు | చిక్కినకర్మములెల్లా జెలగెగాక |
తక్కక శ్రీవేంకటేశు దాస్యమెక్కుడైనట్టు | యెక్కడా మోక్షోపాయమిక జెప్పనున్నదా ||
pa|| anniTAnu haridAsu ladhikulu | kannulavaMTivAru kamalajAdulaku ||
ca|| aMdarunu samamaitE naruhAnaruhamu lEdA | aMdarilO hariyaitE naugAka |
boMditO viprunidecci pUjiMcinaTTu vErE- | poMdugAniSunakamu bUjiMpadagunA ||
ca|| annimatamulu sariyaitEnu vAsilEdA | cennaguburANAlu ceppugAka |
yennaga sorNATaMka miMtaTAnu jellinaTlu | sannapudOlubiLLalu sarigA jellunA ||
ca|| gakkuna bairu vittagA gAdamu moracinaTlu | cikkinakarmamulellA jelagegAka |
takkaka SrIvEMkaTESu dAsyamekkuDainaTTu | yekkaDA mOkShOpAyamika jeppanunnadA ||