Anniti kekkuduyeevi - అన్నిటి కెక్కుడుయీవి

అన్నిటి కెక్కుడుయీవి హరియిచ్చేది మన్నించునాతనికంటే మఱి లేరు దొరలు

తగుబ్రహ్మలోకముదాకా నెక్కిచూచిన మగుడ బుట్టేలోకాలే మనుజులకు తెగియిచ్చే యింద్రాదిదేవతలవరములు యెగుఅదిగువలను యీసందివే

మాయలోన బుట్టేది మాయలోన బెరిగేది కాయదారులుకు నెల్లా గలిగినదే నేయరానిపుణ్యమెల్లా జేసి గండించుకొనేది చాయల బహురూప సంసారమే

చెడనివై కుంఠ మిచ్చు జేటులేనిపరమిచ్చు వెడమాయ బెడబాపు విష్ణు డీతడే యెడయక శ్రీ వేంకటేశుడై వున్నాడు వీడె జడియ కితడే కాచు శరణంటే జాలును

Anniti kekkuduyeevi hariyichchedi Mannimchunaatanikamte mari leru doralu

Tagubrahmalokamudaakaa nekkichoochina Maguda buttelokaale manujulaku Tegiyichche yindraadidevatalavaramulu Yeguadiguvalanu yeesamdive

Maayalona buttedi maayalona berigedi Kaayadaaruluku nellaa galiginade Neyaraanipunyamellaa jesi gandinchukonedi Chaayala bahuroopa samsaarame

Chedanivai kuntha michchu jetuleniparamichchu Vedamaaya bedabaapu vishnu deetade Yedayaka Sree venkatesudai vunnaadu veede Jadiya kitade kaachu saranamte jaalunu