ప|| అన్నియును దన ఆచార్యాధీనము | చెన్నుమీఱ హరిపాదసేవసేయు మనసా ||
చ|| దైవమా గొంచము గాడు తానూ గొంచము గాడు | భావించికొలచేవారిపరిపాటి |
చేవల బత్తిముదుగు చేనిముదుగూ లేదు | వావిరి బోగెత్తెటివారివారినేరుపు ||
చ|| కాలము కడమలేదు కర్మము కడమలేదు | కేలి విశ్వాసముగలిగినపాటి |
వ్రాలకి ముదిమీ లేదు వక్కణ ముదిమీ లేదు | పోలించేటివిద్వాంసులబుద్ధిలోనినేరుపు ||
చ|| జ్ఞానానకు దప్పు లెదు జన్మానకు దప్పు లేదు | నానాటికి వివేకించి నడచేపాటి |
శ్రీవేంకటపతి యింతకు మూలము | ఆనుక యీతని శరణనేవారినేరుపు ||
pa|| anniyunu dana AcAryAdhInamu | cennumIrxa haripAdasEvasEyu manasA ||
ca|| daivamA goMcamu gADu tAnU goMcamu gADu | BAviMcikolacEvAriparipATi |
cEvala battimudugu cEnimudugU lEdu | vAviri bOgetteTivArivArinErupu ||
ca|| kAlamu kaDamalEdu karmamu kaDamalEdu | kEli viSvAsamugaliginapATi |
vrAlaki mudimI lEdu vakkaNa mudimI lEdu | pOliMcETividvAMsulabuddhilOninErupu ||
ca|| j~jAnAnaku dappu ledu janmAnaku dappu lEdu | nAnATiki vivEkiMci naDacEpATi | pAnipaTTi SrIvEMkaTapati yiMtaku mUlamu | Anuka yItani SaraNanEvArinErupu ||