ప|| అన్నియును హరినేనేయటమటాలే యివి | పన్నిన సుజ్ఞానికి బయలై తోచును ||
చ|| తిరుపై యవ్వలవ్వల దిరుగుచుండేటివేళ | దిరిగినట్ల నుండు దిక్కులెల్లాను |
సిరులసంసారభ్రమ జిక్కినజీవునికిని | సరిగ నైహికము పరమై తోచు ||
చ|| సొగిసి యద్దమునీడ చూచినవేళ దనకు | మగుడ వేఱొకరూపు మతి దోచును |
తగిలి యిట్లానేపో తనుదా నెఱగకున్న | నిగిడినపుట్టువులు నిజమై తోచు ||
చ|| కదిసినసకలాంధకార మంతటా గప్పి | వుదయమైతే నన్నీ నొదిగినట్టు |
హృదయపుశ్రీవేంకటేశుడు వెల్లవిరైతే | మదిలో నజ్ఞానము మాయమై తోచు ||
pa|| anniyunu harinEnEyaTamaTAlE yivi | pannina suj~jAniki bayalai tOcunu ||
ca|| tirupai yavvalavvala dirugucuMDETivELa | diriginaTla nuMDu dikkulellAnu |
sirulasaMsAraBrama jikkinajIvunikini | sariga naihikamu paramai tOcu ||
ca|| sogisi yaddamunIDa cUcinavELa danaku | maguDa vErxokarUpu mati dOcunu |
tagili yiTlAnEpO tanudA nerxagakunna | nigiDinapuTTuvulu nijamai tOcu ||
ca|| kadisinasakalAMdhakAra maMtaTA gappi | vudayamaitE nannI nodiginaTTu |
hRudayapuSrIvEMkaTESuDu vellaviraitE | madilO naj~jAnamu mAyamai tOcu ||