ప|| ఆపదల సంపదల నలయుటేమిట మాను | రూపింప నిన్నిటను రోసినను గాక ||
చ|| కడలేని దేహ రోగంబులేమిట మాను | జడను విడిపించు నౌషధ సేవగాక |
విడవ కడియాస తను వేచుటేమిట మాను | వొడలి కలగుణమెల్ల నుడిగినను గాక ||
చ|| దురిత సంగ్రహమైన దుఃఖమేమిట మాను | సరిలేని సౌఖ్యంబు చవికొన్న గాక |
కరుకైన మోహాంధకార మేమిటి మాను | అరిది తేజోమార్గ మలవడిన గాక ||
చ|| చావులో బెనగొన్న జన్మ మేమిటి మాను | యీవలావలి కర్మమెడసిన గాక |
భావింప నరుదైన బంధమేమిటి మాను | శ్రీ వేంకటేశ్వరుని సేవచే గాక ||
pa|| Apadala saMpadala nalayuTEmiTa mAnu | rUpiMpa ninniTanu rOsinanu gAka ||
ca|| kaDalEni dEha rOgaMbulEmiTa mAnu | jaDanu viDipiMcu nauShadha sEvagAka |
viDava kaDiyAsa tanu vEcuTEmiTa mAnu | voDali kalaguNamella nuDiginanu gAka ||
ca|| durita saMgrahamaina duHKamEmiTa mAnu | sarilEni sauKyaMbu cavikonna gAka |
karukaina mOhAMdhakAra mEmiTi mAnu | aridi tEjOmArga malavaDina gAka ||
ca|| cAvulO benagonna janma mEmiTi mAnu | yIvalAvali karmameDasina gAka |
BAviMpa narudaina baMdhamEmiTi mAnu | SrI vEMkaTESvaruni sEvacE gAka ||