ప|| అరుదరుదు నీమాయ హరిహరీ | అరసి తెలియరాదు హరిహరీ ||
చ|| అనంత బ్రహ్మాడములవె రోమకూపముల | అనంతములై వున్నవి హరిహరీ |
పొనిగి కుంగినవొక్కభూమి నీవెత్తినది యే- | మని నుతింతు నిన్ను హరిహరీ ||
చ|| పొదిగి బ్రహ్మాదులు నీబొడ్డున నేకాలము | అదివో పుట్టుచున్నారు హరిహరీ |
పొదలి యీజీవుడు పుట్టించే యీసామర్ధ్యము | అదన నేమనిచెప్పే హరిహరీ ||
చ|| పావన వైకుంఠము నీపాద మూలమందున్నది | ఆవహించే భక్తిచేత హరిహరీ |
శ్రీవేంకాటాద్రి మీదచేరి నీవిట్టె వుండగా- | నావల వెదకనేల హరిహరీ ||
pa|| arudarudu nImAya hariharI | arasi teliyarAdu hariharI ||
ca|| anaMta brahmADamulave rOmakUpamula | anaMtamulai vunnavi hariharI | ponigi kuMginavokkaBUmi nIvettinadi yE- | mani nutiMtu ninnu hariharI ||
ca|| podigi brahmAdulu nIboDDuna nEkAlamu | adivO puTTucunnAru hariharI | podali yIjIvuDu puTTiMcE yIsAmardhyamu | adana nEmaniceppE hariharI ||
ca|| pAvana vaikuMThamu nIpAda mUlamaMdunnadi | AvahiMcE BakticEta hariharI |
SrIvEMkATAdri mIdacEri nIviTTe vuMDagA- | nAvala vedakanEla hariharI ||