ప|| అరిదిసేతలే చేసి తల్లాడ నిల్లాడ | సరిలేక వుండితివి జలరాశికాడ ||
చ|| పొలియంబీర్చితి వొకతి బురిటిమంచముకాడ | నలచితి వొకని గగనంబుకాడ |
బలిమి దన్నితి వొకని బండిపోతులకాడ | దులిమితివి యేడుగుర దోలి మందకాడ ||
చ|| తడవి మోదితి వొకని తాటిమాకులకాడ- | నడిచితి వొకని బేయలకాడను |
పిడిచివేసితి వొకని బృందావనముకాడ | వొడిసితివి వొకని నావులమందకాడ ||
చ|| పటపటన దిక్కులు పగుల బగతుల దునిమి | నటియించితివి మామనగరికాడ |
కుటిలబాహు దైత్యాంతకుడవు వేంకటరాయ | పుటమెగసితి జగంబుల యింటికాడ ||
pa|| aridisEtalE cEsi tallADa nillADa | sarilEka vuMDitivi jalarASikADa ||
ca|| poliyaMbIrciti vokati buriTimaMcamukADa | nalaciti vokani gaganaMbukADa |
balimi danniti vokani baMDipOtulakADa | dulimitivi yEDugura dOli maMdakADa ||
ca|| taDavi mOditi vokani tATimAkulakADa- | naDiciti vokani bEyalakADanu |
piDicivEsiti vokani bRuMdAvanamukADa | voDisitivi vokani nAvulamaMdakADa ||
ca|| paTapaTana dikkulu pagula bagatula dunimi | naTiyiMcitivi mAmanagarikADa | kuTilabAhu daityAMtakuDavu vEMkaTarAya | puTamegasiti jagaMbula yiMTikADa ||