రాగం: ళలిత
అయ్యో వికల్పవాదులంతటా సిగ్గువడరు యియ్యెడ నెట్టుగలిగె నీయసురమతము.
నీముద్రలూ నొల్లరు నీదాసోహము నొల్లరు కామించి నీమీదిభక్తి కడు నొల్లరు నామమంత్రము నొల్లరనామయుండ వనెందురు తాము వైష్ణవుల మంటా దర్కింతురు.
పైకృతవేళ నీప్రసాదమూ నొల్లరు ఘాతలనూర్ధ్వపుండ్రము గాదందురు ఝాతరదైవాల నిన్ను సరిగా బూజింతురు ఆఅతల వైష్ణవులు దామనుకొందురు..
శ్రీవైష్ణవుల గంటే జేతులెత్తి మొక్కరు భావింతురు పగ వారిబలె గన్నట్టు ఆఅవల వైకుంఠమూ ననిత్యమందురు కావించి వైష్ణవులము కామా నే మందురు.
వరుస రావణాదులవలె నెజ్ఞాలు సేతురు శరుస నట్టే వేదమూ జదువుదురు ణిరతి శ్రీవేంకటేశ నీమహిమ లెరగక ఆరిది వైష్ణవులమే యని యాడుకొందురు.
Raagam: LalitaAyyo vikalpavaadulamtataa sigguvadaru Yiyyeda nettugalige neeyasuramatamu.
Neemudraloo nollaru needaasohamu nollaru Kaamimchi neemeedibhakti kadu nollaru Naamamamtramu nollaranaamayumda vanemduru Taamu vaishnavula mamtaa darkimturu.
Paikrtavela neeprasaadamoo nollaru Ghaatalanoordhvapumdramu gaadamduru Jhaataradaivaala ninnu sarigaa boojimturu Aaatala vaishnavulu daamanukomduru..
Sreevaishnavula gamte jetuletti mokkaru Bhaavimturu paga vaaribale gannattu Aaavala vaikumthamoo nanityamamduru Kaavimchi vaishnavulamu kaamaa ne mamduru.
Varusa raavanaadulavale negyanaalu seturu Sarusa natte vedamoo jaduvuduru Nirati sreevenkatesa neemahima leragaka Aaridi vaishnavulame yani yaadukomduru.