ప|| ఎండలోనినీడ యీమనసు | పండుగాయ సేయబనిలేదు మనసు ||
చ|| వానచేతకములవలెనాయ మనసు | గోనెబట్టిన బంకగుణమాయ మనసు |
మానజిక్కినకోలమతమాయ మనసు | తేనెలోపలి యీగతెరుగాయ మనసు ||
చ|| గడిరాజుబదుకాయ కడలేని మనసు | నడివీది పెసరాయ నయమైనమనసు |
గడకుగట్టిన పాతగతిదోచె మనసు | అడసులోపలి కంబమై తోచెమనసు ||
చ|| తెరువుచూపినజాడ దిరుగు నీమనసు | మరుగుజేసినచోట మరుగు నీమనసు |
తిరువెంకటేశుపై దిరమైన మనసు | సిరిగలిగినచోట జేరు నీమనసు ||
pa|| eMDalOninIDa yImanasu | paMDugAya sEyabanilEdu manasu ||
ca|| vAnacEtakamulavalenAya manasu | gOnebaTTina baMkaguNamAya manasu |
mAnajikkinakOlamatamAya manasu | tEnelOpali yIgaterugAya manasu ||
ca|| gaDirAjubadukAya kaDalEni manasu | naDivIdi pesarAya nayamainamanasu |
gaDakugaTTina pAtagatidOce manasu | aDasulOpali kaMbamai tOcemanasu ||
ca|| teruvucUpinajADa dirugu nImanasu | marugujEsinacOTa marugu nImanasu |
tiruveMkaTESupai diramaina manasu | sirigaliginacOTa jEru nImanasu ||