ప|| ఊరికి బోయెడి వోతడ కడు- | చేరువతెరు వేగి చెలగుమీ ||
చ|| ఎడమతెరువువంక కేగిన దొంగలు | తొడిబడ గోకలు దోచేరు |
కుడితెరువున కేగి కొట్టువడక మంచి- | నడిమితెరువుననే నడవుమీ ||
చ|| అడ్డపుదెరువుల నటునిటు జుట్టాలు | వెడ్డువెట్టుచు నిన్ను వేచేరు |
గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక | దొడ్డపుతెరువువంక తొలగుమీ ||
చ|| కొండతెరువు కేగి కొంచెపుసుఖముల | బండై తిరుగుచు బడలేవు |
అండనుండెడి పరమాత్ముని తిరుమల- | కొండతెరువు తేకువ నేగుమీ ||
pa|| Uriki bOyeDi vOtaDa kaDu- | cEruvateru vEgi celagumI ||
ca|| eDamateruvuvaMka kEgina doMgalu | toDibaDa gOkalu dOcEru |
kuDiteruvuna kEgi koTTuvaDaka maMci- | naDimiteruvunanE naDavumI ||
ca|| aDDapuderuvula naTuniTu juTTAlu | veDDuveTTucu ninnu vEcEru |
goDDErEcinnadiDDiteruvu vOka | doDDaputeruvuvaMka tolagumI ||
ca|| koMDateruvu kEgi koMcepusuKamula | baMDai tirugucu baDalEvu |
aMDanuMDeDi paramAtmuni tirumala- | koMDateruvu tEkuva nEgumI ||