ప|| ఇద్దరి భావములును యీడుజోళ్ళాయ నిదె | అడ్డుకొని తులదూగినట్టి చందమాయెను ||
చ|| తళుకున నీవిప్పుడు తరుణి జూచితేను | తొలకి చెక్కుచెమట దొరుగ జొచ్చె |
లలి మీరి ఆమెరుపులకు యీ తురుము మేఘ- | మలరి వాన గురిసినట్టి చందమాయెను ||
చ|| చదురుమాటల నీవు జలజాక్షి బిలిచితే | పొదిగొని నిలువెల్ల బులకించెను |
కదిసి ఆమాటల గాలికి యీమైదీగె | అదనుగూడ ననిచినట్టి చందమాయెను ||
చ|| ననుపై శ్రీ వేంకటేశ నవ్వి నీవు గూడితేను | యెనసి కామిని చిత్తమెల్ల గరగె |
వొనరి ఆ వెన్నెల కీ మనసనే చంద్రకాంత | మనువుగా గరగినయట్టి చందమాయెను ||
pa|| iddari BAvamulunu yIDujOLLAya nide | aDDukoni tuladUginaTTi caMdamAyenu ||
ca|| taLukuna nIvippuDu taruNi jUcitEnu | tolaki cekkucemaTa doruga jocce |
lali mIri Amerupulaku yI turumu mEGa- | malari vAna gurisinaTTi caMdamAyenu ||
ca|| cadurumATala nIvu jalajAkShi bilicitE | podigoni niluvella bulakiMcenu |
kadisi AmATala gAliki yImaidIge | adanugUDa nanicinaTTi caMdamAyenu ||
ca|| nanupai SrI vEMkaTESa navvi nIvu gUDitEnu | yenasi kAmini cittamella garage |
vonari A vennela kI manasanE caMdrakAMta | manuvugA garaginayaTTi caMdamAyenu ||