ప|| ఇద్దరు జాణలేమీరు యెంచి చూచితే | పొద్దులు గడుపుదురా పొరుగునను ||
చ|| దిగ్గన సరసమున దిట్టులెన్ని దిట్టినాను | యెగ్గులు వట్టుదురా యింతలోననే |
వెగ్గళించి చనవున వెస మర్మము లంటితే | సిగ్గులు వడుదురా జిగిమించను ||
చ|| జవ్వనపాయముతోడ సారె సారె జెనకితే | నవ్వులు నవ్వుదురా నట్టనడుమ |
నివ్వటిల్లు సన్నలెల్లా నెట్టుకొన జేసితేను | రవ్వలు సేయుదురా రచ్చలోనను ||
చ|| సమ్మతించి కాగిళ్ళను సమరతి బెనగితే | బొమ్మల జంకింతురా పూచిపట్టుక |
యిమ్ముల శ్రీవేంకటేశ యిట్టె మీరు గూడితిరి | దొమ్ములు సేయుదురా తోడదోడను ||
pa|| iddaru jANalEmIru yeMci cUcitE | poddulu gaDupudurA porugunanu ||
ca|| diggana sarasamuna diTTulenni diTTinAnu | yeggulu vaTTudurA yiMtalOnanE |
veggaLiMci canavuna vesa marmamu laMTitE | siggulu vaDudurA jigimiMcanu ||
ca|| javvanapAyamutODa sAre sAre jenakitE | navvulu navvudurA naTTanaDuma |
nivvaTillu sannalellA neTTukona jEsitEnu | ravvalu sEyudurA raccalOnanu ||
ca|| sammatiMci kAgiLLanu samarati benagitE | bommala jaMkiMturA pUcipaTTuka |
yimmula SrIvEMkaTESa yiTTe mIru gUDitiri | dommulu sEyudurA tODadODanu ||