ప|| ఇద్దరు నొకటే యెప్పుడును | బుద్ధులు చెప్పరే పొలతుకలూ ||
చ|| చలమున నూరకే సాదించీ జెలి | తలపు దెలియకే తన పతిని |
కలి ముదిసి మేడిదె గాక తొలుతనె | కలక దేరుచరే కామినులు ||
చ|| విచ్చల విడిగా వెంగెము లాడి | గచ్చుల యలుకల కాంతుని |
హెచ్చి గోరి రేక యేరుగా నెపుడే | మచ్చిక సేయరే మానినులు ||
చ|| పనివడి కూడుచు బంతము లాడి | ఘనుడగు శ్రీ వేంకటపతి విభుని |
ననలే విరులై నాటకమునుపనె | పెనగి మొక్కించరే ప్రియ సఖులు ||
pa|| iddaru nokaTE yeppuDunu | buddhulu cepparE polatukalU ||
ca|| calamuna nUrakE sAdiMcI jeli | talapu deliyakE tana patini |
kali mudisi mEDide gAka tolutane | kalaka dErucarE kAminulu ||
ca|| viccala viDigA veMgemu lADi | gaccula yalukala kAMtuni |
hecci gOri rEka yErugA nepuDE | maccika sEyarE mAninulu ||
ca|| panivaDi kUDucu baMtamu lADi | GanuDagu SrI vEMkaTapati viBuni |
nanalE virulai nATakamunupane | penagi mokkiMcarE priya saKulu ||