idivo saMsAra meMta - ఇదివొ సంసార మెంత

ఇదివొ సంసార (రాగం: ) (తాళం : )

ప|| ఇదివొ సంసార మెంతసుఖమోకని | తుదలేనిదుఃఖమను తొడవు గడియించె ||

చ|| పంచేంద్రియంబులను పాతకులు దనుదెచ్చి | కొంచెపుసుఖంబునకు గూర్పగాను |

మించి కామంబనెడి మేటితనయుండు జని- | యించి దురితధనమెల్ల గడియించె ||

చ|| పాయమనియెడి మహాపాతకుడు తను దెచ్చి | మాయంపుసుఖమునకు మరువగాను |

సోయగపు మోహమను సుతుడేచి గుణమెల్ల | బోయి యీనరకమను పురము గడియించె ||

చ|| అతిశయుండగు వేంకటాధీశుడను మహా- | హితుడు చిత్తములోన నెనయగాను |

మతిలోపల విరక్తిమగువ జనియించి య- | ప్రతియయి మోక్షసంపదలు గడియించె ||

idivo saMsAra (Raagam: ) (Taalam: )

pa|| idivo saMsAra meMtasuKamOkani | tudalEniduHKamanu toDavu gaDiyiMce ||

ca|| paMcEMdriyaMbulanu pAtakulu danudecci | koMcepusuKaMbunaku gUrpagAnu |

miMci kAmaMbaneDi mETitanayuMDu jani- | yiMci duritadhanamella gaDiyiMce ||

ca|| pAyamaniyeDi mahApAtakuDu tanu decci | mAyaMpusuKamunaku maruvagAnu |

sOyagapu mOhamanu sutuDEci guNamella | bOyi yInarakamanu puramu gaDiyiMce ||

ca|| atiSayuMDagu vEMkaTAdhISuDanu mahA- | hituDu cittamulOna nenayagAnu |

matilOpala viraktimaguva janiyiMci ya- | pratiyayi mOkShasaMpadalu gaDiyiMce ||