పల్లవి:ఇదియే సులభము ఇందరికి కదియగ వశమా కరుణనె గాక
చరణం:నగధరుందు పన్నగశయనుదు భూ గగనాంతరిక్ష గాత్రుండు
అగణితుడితని నరసి తెలియగా తగునా కనెడిది దాస్యమె గాక
చరణం:కమలజ జనకుడు కాముని జనకుడు కమలాసతిపతి ఘనగుణుడూ
విమలుండీ హరి వెదకి కావగను అమరున శరణా గతి గాక
చరణం:దేవుడు త్రిగుణాతీతుడనంతుడు కైవల్యమొసగు ఘనుడితడు
శ్రి వేంకతాపతి జీవాంత రాత్ముడు భావించ వశమా భక్తినె గాక
pallavi:idiyE sulabhamu indariki kadiyaga vaSamaa karuNane gaaka
charaNam:nagadharundu pannagaSayanudu bhU gaganaantariksha gaatrunDu
agaNituDitani narasi teliyagaa tagunaa kaneDidi daasyame gaaka
charaNam:kamalaja janakuDu kaamuni janakuDu kamalaasatipati ghanaguNuDU
vimalunDI hari vedaki kaavaganu amaruna SaraNaa gati gaaka
charaNam:dEvuDu triguNaateetuDanantuDu kaivalyamosagu ghanuDitaDu
Sri vEnkataapati jeevaanta raatmuDu Bhavincha vasemaa bhaktine gaaka