ప|| ఇదియే మర్మము హరి యిందుగాని లోనుగాడు | పదపడి జీవులాల బదుకరో ||
చ|| హరి గానలేరు అరసెందువెదికినా | హరిదాసు లెఱుగుదు రడుగరో |
గరిమె బ్రత్యక్షము గాడు దేవు డెవ్వరికి | ధర బ్రత్యక్షము హరిదాసుల గొలువరో ||
చ|| చేత ముట్టి గోవిందుని శిరసు పూజించలేరు | చేతులార ప్రసన్నులసేవ సేయరో |
జాతిగాగ విష్ణునిప్రపాద మేడ దొరకీని | ఆతల వారి బ్రసాద మడుగరో ||
చ|| అంతరంగమున నున్నాడందురు విష్ణుడు గాని | అంతటా నున్నారు వైష్ణవాధికులు |
చెంతల దదియ్యులచేతియనుజ్ఞ వడసి | సంతతం శ్రీవెంకటేశుశరణము చొరరో ||
pa|| idiyE marmamu hari yiMdugAni lOnugADu | padapaDi jIvulAla badukarO ||
ca|| hari gAnalEru araseMduvedikinA | haridAsu lerxugudu raDugarO |
garime bratyakShamu gADu dEvu Devvariki | dhara bratyakShamu haridAsula goluvarO ||
ca|| cEta muTTi gOviMduni Sirasu pUjiMcalEru | cEtulAra prasannulasEva sEyarO |
jAtigAga viShNuniprapAda mEDa dorakIni | Atala vAri brasAda maDugarO ||
ca|| aMtaraMgamuna nunnADaMduru viShNuDu gAni | aMtaTA nunnAru vaiShNavAdhikulu |
ceMtala dadiyyulacEtiyanuj~ja vaDasi | saMtataM SrIveMkaTESuSaraNamu corarO ||