ప|| ఇదియె నాకు మతము ఇదివ్రతము | వుదుటుల కర్మము వొల్లనింకను ||
చ|| నిపుణత హరినే నిను శరణనుటే | తపములు జపములు ధర్మములు |
నెపమున సకలము నీవే చేకొను | వుపమల పుణ్యము లొల్ల నే యింకను ||
చ|| హరి నీదాసుడ ననుకొనుటే నా | పరమును ఇహమును భాగ్యమును |
ధర నీ మాయల తప్పు తెరువులను | వొరగీ సుకృతము లొల్లనే ఇంకను ||
చ|| నారాయణ నీ నామము దలచుట | సారపు చదువులు శాస్త్రములు |
ఈరీతి శ్రీవేంకటేశ నిన్నుగొలిచితి | వూరక ఇతరము లొల్ల నే యింకను ||
pa|| idiye nAku matamu idivratamu | vuduTula karmamu vollaniMkanu ||
ca|| nipuNata harinE ninu SaraNanuTE | tapamulu japamulu dharmamulu |
nepamuna sakalamu nIvE cEkonu | vupamala puNyamu lolla nE yiMkanu ||
ca|| hari nIdAsuDa nanukonuTE nA | paramunu ihamunu BAgyamunu |
dhara nI mAyala tappu teruvulanu | voragI sukRutamu lollanE iMkanu ||
ca|| nArAyaNa nI nAmamu dalacuTa | sArapu caduvulu SAstramulu |
IrIti SrIvEMkaTESa ninnugoliciti | vUraka itaramu lolla nE yiMkanu ||