ప|| ఇహమెట్టిదో పరమెట్టిదో ఇక నాకు | సహజమై హరియే శరణము నాకు ||
చ|| చిత్తమిది యొకటే చింత వేవేలసంఖ్య | పొత్తుల హరిదలచ బొద్దులేదు |
జొత్తుల కన్నుల రెండు చూపులైతే ననంతాలు | తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు ||
చ|| చేతులివియు రెండే చేష్టలు లక్షోపలక్ష | యీతల హరి బూజింప నిచ్చలేదు |
జాతి నాలిక వొకటే చవులు కోటానగోటి | రీతి హరినామ ముచ్చరించ వేళలేదు ||
చ|| వీనులివి రెండే వినికి కొలదిలేదు | పూని హరిభక్తి విన బుద్ధి లేదు |
యీనటన శ్రీవేంకటేశు డిటు చూచినను | తానే యేలె నిక దడబాటు లేదు ||
pa|| ihameTTidO parameTTidO ika nAku | sahajamai hariyE SaraNamu nAku ||
ca|| cittamidi yokaTE ciMta vEvElasaMKya | pottula haridalaca boddulEdu |
jottula kannula reMDu cUpulaitE nanaMtAlu | tattariMci harirUpu daggari cUDalEdu ||
ca|| cEtuliviyu reMDE cEShTalu lakShOpalakSha | yItala hari bUjiMpa niccalEdu |
jAti nAlika vokaTE cavulu kOTAnagOTi | rIti harinAma muccariMca vELalEdu ||
ca|| vInulivi reMDE viniki koladilEdu | pUni hariBakti vina buddhi lEdu |
yInaTana SrIvEMkaTESu DiTu cUcinanu | tAnE yEle nika daDabATu lEdu ||