ప|| ఇహమును బరమును యిందే వున్నవి | వహికెక్క దెలియువారలు లేరు ||
చ|| చట్టువంటి దీచంచలపుమనసు | కొట్టులబడేది గుఱిగాదు |
దిట్ట వొరులు బోధించిన గరగదు | పట్టబోయితే పసలేదు ||
చ|| చిగురువంటి దీజీవశరీరము | తగుళ్ళు పెక్కులు తతిలేదు |
తెగనిలంపటమే దినమును బెనచును | మొగము గల దిదే మొనయును లేదు ||
చ|| గనివంటిది యీఘనసంసారము | తనిసితన్పినా దగ లేదు |
ఘనుడగు శ్రీవేంకటపతి గావగ | కొనమొద లేర్పడె కొంకే లేదు ||
pa|| ihamunu baramunu yiMdE vunnavi | vahikekka deliyuvAralu lEru ||
ca|| caTTuvaMTi dIcaMcalapumanasu | koTTulabaDEdi gurxigAdu |
diTTa vorulu bOdhiMcina garagadu | paTTabOyitE pasalEdu ||
ca|| ciguruvaMTi dIjIvaSarIramu | taguLLu pekkulu tatilEdu |
teganilaMpaTamE dinamunu benacunu | mogamu gala didE monayunu lEdu ||
ca|| ganivaMTidi yIGanasaMsAramu | tanisitanpinA daga lEdu |
GanuDagu SrIvEMkaTapati gAvaga | konamoda lErpaDe koMkE lEdu ||