ప|| ఇందిర వడ్డించ నింపుగను | చిందక యిట్లే భుజించవో స్వామి ||
చ|| అక్కాళపాళాలు నప్పాలు వడలు | పెక్కైనసయిదంపు పేణులును |
సక్కెరరాసులు సద్యోఘృతములు | కిక్కిరియ నారగించవో స్వామి ||
చ|| మీరినకెళంగు మిరియపు దాళింపు- | గూరలు కమ్మనికూరలును |
సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే | కూరిమితో జేకొనవో స్వామీ ||
చ|| పిండివంటలును బెరుగులు బాలు | మెండైన పాశాలు మెచ్చి మెచ్చి |
కొండలపొడవు కోరి దివ్యాన్నాలు | వెండియు మెచ్చవే వేంకటస్వామీ ||
pa|| iMdira vaDDiMca niMpuganu | ciMdaka yiTlE BujiMcavO svAmi ||
ca|| akkALapALAlu nappAlu vaDalu | pekkainasayidaMpu pENulunu |
sakkerarAsulu sadyOGRutamulu | kikkiriya nAragiMcavO svAmi ||
ca|| mIrinakeLaMgu miriyapu dALiMpu- | gUralu kammanikUralunu |
sAraMpubaccaLLu cavuluga niTTE | kUrimitO jEkonavO svAmI ||
ca|| piMDivaMTalunu berugulu bAlu | meMDaina pASAlu mecci mecci |
koMDalapoDavu kOri divyAnnAlu | veMDiyu meccavE vEMkaTasvAmI ||