ప|| ఇందాకా నెఱగనైతి నిక గపటములేల | చెంది యిట్టె నాతోడ జెప్పవయ్య మాటలు ||
చ|| మంతనానకు రాగాను మనసెల్లా నొక్కటాయ | పంతము నీ వియ్యగాను పాసెగోపము |
అంతరంగము చెప్పగా ననుమానమింక నెంచ | రంతులు సేయక యిట్టె రావయ్య యింటికి ||
చ|| సరసము నీవాడగా చల్లనాయనా మేను | సరుస గూచుండగాను సమ్మతించితివి |
యెరవులేక నవ్వగా నిరవాయ గూరిములు | బిరిదులెల్లా గంటి బెట్టవయ్య విడెము ||
చ|| గక్కన నీవు గూడగా కాతాళము లణగె | మిక్కిలి మన్నించగాను మెచ్చితి నేను |
అక్కున శ్రీ వేంకటేశ అలమేలు మంగను నేను | వొక్కటై కూడితి విట్టె వుండవయ్య వొద్దను ||
pa|| iMdAkA nerxaganaiti nika gapaTamulEla | ceMdi yiTTe nAtODa jeppavayya mATalu ||
ca|| maMtanAnaku rAgAnu manasellA nokkaTAya | paMtamu nI viyyagAnu pAsegOpamu |
aMtaraMgamu ceppagA nanumAnamiMka neMca | raMtulu sEyaka yiTTe rAvayya yiMTiki ||
ca|| sarasamu nIvADagA callanAyanA mEnu | sarusa gUcuMDagAnu sammatiMcitivi |
yeravulEka navvagA niravAya gUrimulu | biridulellA gaMTi beTTavayya viDemu ||
ca|| gakkana nIvu gUDagA kAtALamu laNage | mikkili manniMcagAnu mecciti nEnu |
akkuna SrI vEMkaTESa alamElu maMganu nEnu | vokkaTai kUDiti viTTe vuMDavayya voddanu ||