ప|| ఇందుకొరకె యిందరును నిట్లయిరి | కిందుపడి మరికాని గెలుపెరగరాదు ||
చ|| అటమటపు వేడుకల నలయించి మరికదా | ఘటియించు బరము తటుకన దైవము |
ఇటుసేయు నీశ్వరున కీసు గలదా లేదు | కుటిలమతి గని కాని గురి గానరాదు ||
చ|| బెండుపడ నవగతుల బెనగించి మరికదా | కొండనుచు బరమొసంగును దైవము |
బండుసేయగ హరికి బంతమా యటుగాదు | యెండదాకక నీడహిత వెరగరాదు ||
చ|| మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మరికదా | తనభక్తి యొసగు నంతట దైవము |
ఘనవేంకటేశునకు గపటమా అటుగాదు | తినక చేదును దీపు తెలియనేరాదు ||
pa|| iMdukorake yiMdarunu niTlayiri | kiMdupaDi marikAni geluperagarAdu ||
ca|| aTamaTapu vEDukala nalayiMci marikadA | GaTiyiMcu baramu taTukana daivamu | iTusEyu nISvaruna kIsu galadA lEdu | kuTilamati gani kAni guri gAnarAdu ||
ca|| beMDupaDa navagatula benagiMci marikadA | koMDanucu baramosaMgunu daivamu | baMDusEyaga hariki baMtamA yaTugAdu | yeMDadAkaka nIDahita veragarAdu ||
ca|| munupa vElpulakella mrokkiMci marikadA | tanaBakti yosagu naMtaTa daivamu | GanavEMkaTESunaku gapaTamA aTugAdu | tinaka cEdunu dIpu teliyanErAdu ||