ప|| ఇందుకేపోవెరగయ్యీ నేమందును | కందులేని నీమహిమ కొనియాడగలనా ||
చ|| అటుదేవతలకెల్ల నమృతమిచ్చిననీవు | యిటు వెన్న దొంగిలుట కేమందును |
పటుగతి బలీంద్రుని బంధించినట్టి నీవు | నట రోలగట్టవడ్డచందాన కేమందును ||
చ|| కలిగి యాకరిరాజు గరుణ గాచిననీవు | యిల నావుల గాచుట కేమందును |
తలవ బ్రహ్మాదిదేవతలకు జిక్కనినీవు | చెలులకాగిళ్ళకు జిక్కితి వేమందును ||
చ|| భావించ నన్నిటికికంటే బరమమూర్తివి నీవు | యీవల బాలుడవైతి వేమందును |
కావించి బ్రహ్మాండాలు కడుపున నిడుకొని | శ్రీవేంకటాద్రినిలిచితి వేమందును ||
pa|| iMdukEpOveragayyI nEmaMdunu | kaMdulEni nImahima koniyADagalanA ||
ca|| aTudEvatalakella namRutamiccinanIvu | yiTu venna doMgiluTa kEmaMdunu |
paTugati balIMdruni baMdhiMcinaTTi nIvu | naTa rOlagaTTavaDDacaMdAna kEmaMdunu ||
ca|| kaligi yAkarirAju garuNa gAcinanIvu | yila nAvula gAcuTa kEmaMdunu |
talava brahmAdidEvatalaku jikkaninIvu | celulakAgiLLaku jikkiti vEmaMdunu ||
ca|| BAviMca nanniTikikaMTE baramamUrtivi nIvu | yIvala bAluDavaiti vEmaMdunu | kAviMci brahmAMDAlu kaDupuna niDukoni | SrIvEMkaTAdriniliciti vEmaMdunu ||