ప|| ఇందుకుగా నాయెరగమి నేమని దూరుదును | అందియు నినునే దెలియక అయ్యోనేనిపుడు ||
చ|| ఆతుమ లోన నుండి యఖిలోపాయములు | చేతనునకు నీవే చింతించగాను |
కాతుర పడి నేను కర్తననుచు బనులు | యాతల జెప్పగబూనే విస్సిరో ||
చ|| తనువిటు నీవొసగి తగుభాగ్యము నీవై | అనువుగ జీవునినీ యటు నీవేలగను |
తనియక నేనొరులు దాతలనుచుబోయి | కనుగొని వేడగ దొడగేకటకటా ||
చ|| శ్రీ వేంకటాద్రిపై నుండి చేరి కన్నులెదుటను | సేవగొని యిటేకృపసేయ గాను |
సేవలగన్న వారెల్ల జుట్టములంట నేను | జీవులతోబొందు సేసేజెల్లబో ||
pa|| iMdukugA nAyeragami nEmani dUrudunu | aMdiyu ninunE deliyaka ayyOnEnipuDu ||
ca|| Atuma lOna nuMDi yaKilOpAyamulu | cEtanunaku nIvE ciMtiMcagAnu |
kAtura paDi nEnu kartananucu banulu | yAtala jeppagabUnE vissirO ||
ca|| tanuviTu nIvosagi taguBAgyamu nIvai | anuvuga jIvuninI yaTu nIvElaganu |
taniyaka nEnorulu dAtalanucubOyi | kanugoni vEDaga doDagEkaTakaTA ||
ca|| SrI vEMkaTAdripai nuMDi cEri kannuleduTanu | sEvagoni yiTEkRupasEya gAnu |
sEvalaganna vArella juTTamulaMTa nEnu | jIvulatOboMdu sEsEjellabO ||