ప|| ఇందుకేకాబోలు నీవు యిట్టే యవధరించేవు | కందువ లన్నియు నీమై గనియైనట్లుండె ||
చ|| హరి నీవు కప్పురకా పవధరించేవేళ | విరివిగా నిందరు భావించి చూచితే |
తరుణులనవ్వులెల్లా దట్టమై నీమేనిమీద | పెరిగిపెరిగి యట్టే పేరినయట్లుండె ||
చ|| భువనేశ నీవు తట్టుపుణుగు చాతుకొనగ | యివల నీదాసులెల్లా నెంచిచూచితే |
కవగూడి నీసతులకనుచూపులెల్లాను | తివిరి నీమేనిమీద తిరమైనట్లుండె ||
చ|| శ్రీవేంకటేశ నీచెలి యలమేల్మంగతో | తావున మెరసేది నే దలిచితేను |
కోవరపుగొల్లెతల గుబ్బలకుంకుమనిగ్గు | వేవేలయి నీయందచ్చు వేసినయట్లుండె ||
pa|| iMdukEkAbOlu nIvu yiTTE yavadhariMcEvu | kaMduva lanniyu nImai ganiyainaTluMDe ||
ca|| hari nIvu kappurakA pavadhariMcEvELa | virivigA niMdaru BAviMci cUcitE |
taruNulanavvulellA daTTamai nImEnimIda | perigiperigi yaTTE pErinayaTluMDe ||
ca|| BuvanESa nIvu taTTupuNugu cAtukonaga | yivala nIdAsulellA neMcicUcitE |
kavagUDi nIsatulakanucUpulellAnu | tiviri nImEnimIda tiramainaTluMDe ||
ca|| SrIvEMkaTESa nIceli yalamElmaMgatO | tAvuna merasEdi nE dalicitEnu |
kOvarapugolletala gubbalakuMkumaniggu | vEvElayi nIyaMdaccu vEsinayaTluMDe ||