ప|| ఇంతే మరేమిలేదు యిందుమీదను | దొంతులకర్మాలు దుమ్ముదూరుపెత్తుట ||
చ|| వుల్లములో నుండి దేహమొగి రక్షించేహారి- | నొల్లకున్న తన్ను దానొల్లకుండుట |
బల్లిదు డతని మానిపరుల వేడేదెల్లా | పొల్లకట్టు దంచిదంచి పోగుసేసుకొనుట ||
చ|| యెయ్యెడా బుణ్యఫలము లేమి గలిగిన హరి- | కియ్యకున్న నది దైవమియ్యకుండుట |
చెయ్యార నాతని కొప్పుసేయని భోగములెల్లా | చయ్యన జెరకుబిప్పి చవిగొనుట ||
చ|| శ్రీకాంతుడైనట్టి శ్రీవేంకటేశ్వరుని | జేకొంటె సిరులెల్లా జేకొనుట |
మేకులశ్రీహరినామమే నోరనుడుగుట | కైకొన్న యమృతపుగందు వగుట ||
pa|| iMtE marEmilEdu yiMdumIdanu | doMtulakarmAlu dummudUrupettuTa ||
ca|| vullamulO nuMDi dEhamogi rakShiMcEhAri- | nollakunna tannu dAnollakuMDuTa | ballidu Datani mAniparula vEDEdellA | pollakaTTu daMcidaMci pOgusEsukonuTa ||
ca|| yeyyeDA buNyaPalamu lEmi galigina hari- | kiyyakunna nadi daivamiyyakuMDuTa | ceyyAra nAtani koppusEyani BOgamulellA | cayyana jerakubippi cavigonuTa ||
ca|| SrIkAMtuDainaTTi SrIvEMkaTESvaruni | jEkoMTe sirulellA jEkonuTa | mEkulaSrIharinAmamE nOranuDuguTa | kaikonna yamRutapugaMdu vaguTa ||