ప|| ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు | చెంత రమాదేవిగూడె శ్రీ నరసింహుడు ||
చ|| సరిగొండ లెక్కుకొని సరసములాడుకొంటూ | సొరిదిమోములు తొంగి చూచుకొంటాను |
విరులచెండులగొని వేటులాడుకొంటాను | సిరితోడ విహరించీ శ్రీ నరసింహుడు ||
చ|| భవనాశిలోని నీరుపై జల్లులాడుకొంటాను | నవకపు సిరులను నవ్వుకొంటాను |
జవళిగెమ్మోవులు సన్నలజూపుకొంటాను | చివన నిందరినంటె శ్రీ నరసింహుడు ||
చ|| వేమరు దొడలెక్కుక వీడుదోడులాడుకొంటా | ప్రేమమున గౌగిళ్ళ బెనగుకొంటా |
ఆముక శ్రీ వేంకటాద్రి నౌభళాన నిలిచిరి | శ్రీ మహాలక్ష్మితోడ శ్రీ నరసింహుడు ||
pa|| iMtulAla cUDaramma iddaru jANalE vIru | ceMta ramAdEvigUDe SrI narasiMhuDu ||
ca|| sarigoMDa lekkukoni sarasamulADukoMTU | soridimOmulu toMgi cUcukoMTAnu | virulaceMDulagoni vETulADukoMTAnu | siritODa vihariMcI SrI narasiMhuDu ||
ca|| BavanASilOni nIrupai jallulADukoMTAnu | navakapu sirulanu navvukoMTAnu | javaLigemmOvulu sannalajUpukoMTAnu | civana niMdarinaMTe SrI narasiMhuDu ||
ca|| vEmaru doDalekkuka vIDudODulADukoMTA | prEmamuna gaugiLLa benagukoMTA | Amuka SrI vEMkaTAdri nauBaLAna niliciri | SrI mahAlakShmitODa SrI narasiMhuDu ||