ప|| ఇన్ని చేతలును దేవుడిచ్చినవే | ఉన్నవారి యీపులెల్ల నొద్దికయ్యీనా ||
చ|| తెగని యాపదలకు దేవుడే కలడుగాక | వగలుడుప బరుల వసమయ్యీనా |
నొగలి యితరులకు నోళ్ళు దెరచిన | నగుబాటేకాక మానగ బొయ్యీనా ||
చ|| అగ్గలపు దురితాలు హరియే మానుపుగాక | బగ్గన నొక్కరు వచ్చి పాప బొయ్యేరా |
తగ్గుమగ్గులైనవేళ తలచినవారెల్ల | సిగ్గుబాటేకాక తమ్ముజేరవచ్చేరా ||
చ|| ఎట్టుసేసినను వేంకటేశుడే నేరుచుగాక | కట్టకడ వారెల్ల గరుణించేరా |
ఇట్టే యేమడిగిన నితడే యొసగుగాక | వుట్టివడి యెవ్వరైనా నూరడించేరా ||
pa|| inni cEtalunu dEvuDiccinavE | unnavAri yIpulella noddikayyInA ||
ca|| tegani yApadalaku dEvuDE kalaDugAka | vagaluDupa barula vasamayyInA |
nogali yitarulaku nOLLu deracina | nagubATEkAka mAnaga boyyInA ||
ca|| aggalapu duritAlu hariyE mAnupugAka | baggana nokkaru vacci pApa boyyErA |
taggumaggulainavELa talacinavArella | siggubATEkAka tammujEravaccErA ||
ca|| eTTusEsinanu vEMkaTESuDE nErucugAka | kaTTakaDa vArella garuNiMcErA |
iTTE yEmaDigina nitaDE yosagugAka | vuTTivaDi yevvarainA nUraDiMcErA ||