ప|| ఇన్ని జన్మములేటికి హరిదాసు- | లున్న వూర దానుండిన జాలు ||
చ|| హరిభక్తుల యింటి యన్నము గొనువారి | వరువుడై యుండవలెనన్న జాలు |
పరమభాగవత భవనంబుల జెడ్డ | పురువు దానయి పొడమిన జాలు ||
చ|| వాసుదేవుని భక్తవరుల దాసులు మున్ను | రోసిన యెంగిలి రుచిగొన్న జాలు |
శ్రీసతీశుని దలచినవారి దాసాను- | దాసుడైవుండ దలచినజాలు ||
చ|| శ్రీవేంకటేశు జూచినవారి శ్రీపాద | సేవకుడై యండజేరిన జాలు ||
ఈ విభుదాసుల హితుల పాదధూళి | పావనమై సోకి బ్రదికిన జాలు ||
pa|| inni janmamulETiki haridAsu- | lunna vUra dAnuMDina jAlu ||
ca|| hariBaktula yiMTi yannamu gonuvAri | varuvuDai yuMDavalenanna jAlu |
paramaBAgavata BavanaMbula jeDDa | puruvu dAnayi poDamina jAlu ||
ca|| vAsudEvuni Baktavarula dAsulu munnu | rOsina yeMgili rucigonna jAlu |
SrIsatISuni dalacinavAri dAsAnu- | dAsuDaivuMDa dalacinajAlu ||
ca|| SrIvEMkaTESu jUcinavAri SrIpAda | sEvakuDai yaMDajErina jAlu ||
I viBudAsula hitula pAdadhULi | pAvanamai sOki bradikina jAlu ||