ప|| ఇన్నిలాగులచేత లివియపో కడు- | నెన్నికకెక్కిన చేతులివియపో ||
చ|| గునియుచు దనునెత్తికొమ్మని తల్లిపై- | నెనయజాచిన చేతులివియపో |
కినిసి గోవర్ధనగిరి వెల్లగించిన | యినుమువంటి చేతులివియపో ||
చ|| పిసికి పూతకిచన్ను బిగియించిపట్టిన | యిసుమంతలు చేతులివియపో |
పసుల గాచుచు గొల్లపడచుల యమునలో | యిసుకచల్లిన చేతులివియపో ||
చ|| పరమచైతన్యమై ప్రాణులకెల్లను | యెరవులిచ్చిన చేతులివియపో |
తిరువేంకటగిరి దేవుడై ముక్తికి- | నిరవుచూపెడు చేతులివియపో ||
pa|| innilAgulacEta liviyapO kaDu- | nennikakekkina cEtuliviyapO ||
ca|| guniyucu danunettikommani tallipai- | nenayajAcina cEtuliviyapO |
kinisi gOvardhanagiri vellagiMcina | yinumuvaMTi cEtuliviyapO ||
ca|| pisiki pUtakicannu bigiyiMcipaTTina | yisumaMtalu cEtuliviyapO |
pasula gAcucu gollapaDacula yamunalO | yisukacallina cEtuliviyapO ||
ca|| paramacaitanyamai prANulakellanu | yeravuliccina cEtuliviyapO |
tiruvEMkaTagiri dEvuDai muktiki- | niravucUpeDu cEtuliviyapO ||