ప|| ఇప్పుడిటు విభుబాసి యింతలోననె నేడు | తప్పు లోపలి తప్పు దైవమా చెలికి ||
చ|| నగవు లోపలి యలపు నంపైన పొలయలుక | పగటు లోపలి వెరగు పచ్చివేడి | మొగము కాంతుల మెఱపు ముంచు నలుకల చెదరు | పగలు చీకట్లాయె బాపురా చెలికి ||
చ|| బలిమి లోపలి భయము పలుకుదేనెల కనరు | చెలిమి లోపలి చేదు చింత చెలికి | బలుపు కుచములలోని బట్టబయలగు నడుము | కలిమి లోపలి లేమి కట కటా చెలికి ||
చ|| నిడుపు లోపలి కురుచ నీడ లోపలి యెండ | వడి మంచి తరువు వడువని తమకము | కడు వేంకటేశ్వరుని కౌగిటను పరవశము | మడుగు లోపలి మైల మాన దీచెలికి ||
pa|| ippuDiTu viBubAsi yiMtalOnane nEDu | tappu lOpali tappu daivamA celiki ||
ca|| nagavu lOpali yalapu naMpaina polayaluka | pagaTu lOpali veragu paccivEDi | mogamu kAMtula merxapu muMcu nalukala cedaru | pagalu cIkaTlAye bApurA celiki ||
ca|| balimi lOpali Bayamu palukudEnela kanaru | celimi lOpali cEdu ciMta celiki | balupu kucamulalOni baTTabayalagu naDumu | kalimi lOpali lEmi kaTa kaTA celiki ||
ca|| niDupu lOpali kuruca nIDa lOpali yeMDa | vaDi maMci taruvu vaDuvani tamakamu | kaDu vEMkaTESvaruni kaugiTanu paravaSamu | maDugu lOpali maila mAna dIceliki ||