ప|| ఇన్నిటికి బ్రేరకుడు యీశ్వరుడింతే | పన్ని యీతని దెలిసి బ్రదుకుటే జ్ఞానము ||
చ|| మనసున బుట్టిన మంకుగామక్రోధాలు | పనిలేవు తనకంటే బాపమంటదు |
పనివి తొడిమ నూడి పండు తీగె నంటదు | జనులకెల్లా బ్రకృతి సహజమింతే ||
చ|| చేతులార జేసికొన్న కర్మానకు | ఘాతల గర్త గానంటే కట్టువడడు |
ఆతల నబక ముంచినట్టివేడి చెయ్యంటదు | జాతి దేహము మోచిన సహజమింతే ||
చ|| వాకుననాడినయట్టి వట్టిపల్లదాలనెల్లా | దాకొని పొరయనంటే తప్పులే లేవు |
పైకొని శ్రీవేంకటేశు బంటుకు వళకులేదు | సైకమైన హరిభక్తి సహజమింతే ||
pa|| inniTiki brErakuDu yISvaruDiMtE | panni yItani delisi bradukuTE j~jAnamu ||
ca|| manasuna buTTina maMkugAmakrOdhAlu | panilEvu tanakaMTE bApamaMTadu |
panivi toDima nUDi paMDu tIge naMTadu | janulakellA brakRuti sahajamiMtE ||
ca|| cEtulAra jEsikonna karmAnaku | GAtala garta gAnaMTE kaTTuvaDaDu |
Atala nabaka muMcinaTTivEDi ceyyaMTadu | jAti dEhamu mOcina sahajamiMtE ||
ca|| vAkunanADinayaTTi vaTTipalladAlanellA | dAkoni porayanaMTE tappulE lEvu |
paikoni SrIvEMkaTESu baMTuku vaLakulEdu | saikamaina hariBakti sahajamiMtE ||