ప|| ఇన్నిటికి మూలము యీతనిరూపు | యెన్నగ నుపమలకు నిరవైనట్లుండె ||
చ|| కమలనాభునికి కప్పురకాపు మేన | సముచితముగ బైపై చాతినపుడు |
అమృతముదచ్చేవేళ నట్టే మేన దుంపుర్లు | తమితోడ నిండుకొని దట్టమైనట్లుండె ||
చ|| దైవశిఖామణికి తట్టుపుణుగు మేనను | చేవమీర నించి సేవసేసేయప్పుడు |
వేవేలుగా యమునతో వేమారు నీదులాడగా | కావిరి కాళిమ నిండాగప్పినయట్లుండె ||
చ|| అలమేలుమంగతోడ నట్టే శ్రీవేంకటపతి- | కెలమితో సొమ్మువెట్టి యెంచినపుడు |
కులికి గొల్లెతలను కూడగా గుబ్బలమీద | గలపసపెల్లా వచ్చి కమ్ముకొన్నట్లుండె ||
pa|| inniTiki mUlamu yItanirUpu | yennaga nupamalaku niravainaTluMDe ||
ca|| kamalanABuniki kappurakApu mEna | samucitamuga baipai cAtinapuDu |
amRutamudaccEvELa naTTE mEna duMpurlu | tamitODa niMDukoni daTTamainaTluMDe ||
ca|| daivaSiKAmaNiki taTTupuNugu mEnanu | cEvamIra niMci sEvasEsEyappuDu |
vEvElugA yamunatO vEmAru nIdulADagA | kAviri kALima niMDAgappinayaTluMDe ||
ca|| alamElumaMgatODa naTTE SrIvEMkaTapati- | kelamitO sommuveTTi yeMcinapuDu |
kuliki golletalanu kUDagA gubbalamIda | galapasapellA vacci kammukonnaTluMDe ||