ప|| ఇన్నియు ముగిసెను ఇటు నీలోననే | పన్ని పరుల చెప్పగ చోటేది ||
చ|| కుందని నీ రోమకూపంబులలో | గొందుల బ్రహ్మాండ కోట్లట |
యెందరు బ్రహ్మలో యెంత ప్రపంచమో | యిందు పరులమని యెంచగ నేది ||
చ|| నీ కొన చూపున నెరి కోటి సూర్యు | లేకమగుచు నుదయించురట |
నీ కాయమెంతో నీ వుని కేదో | నీకంటె పరులని నిక్కగ నేది ||
చ|| జీవకోటి నీ చిన్ని మాయలో | ప్రోవులగుచు నటు పొడమె నట |
శ్రీవేంకటేశ్వర చెప్పగ నీవెంతో | ఆవల పరులకు ఆధిక్య మేది ||
pa|| inniyu mugisenu iTu nIlOnanE | panni parula ceppaga cOTEdi ||
ca|| kuMdani nI rOmakUpaMbulalO | goMdula brahmAMDa kOTlaTa |
yeMdaru brahmalO yeMta prapaMcamO | yiMdu parulamani yeMcaga nEdi ||
ca|| nI kona cUpuna neri kOTi sUryu | lEkamagucu nudayiMcuraTa |
nI kAyameMtO nI vuni kEdO | nIkaMTe parulani nikkaga nEdi ||
ca|| jIvakOTi nI cinni mAyalO | prOvulagucu naTu poDame naTa |
SrIvEMkaTESvara ceppaga nIveMtO | Avala parulaku Adhikya mEdi ||