ఇన్నియు గలుగుటేజన్మమున (రాగం: ) (తాళం : )
ప|| ఇన్నియు గలుగుటేజన్మమున నైన | జెన్నలర హరిసేవ సిద్ధించుకొరకు ||
చ|| అరయ వేదాధ్యనమది బ్రహ్మశుద్ధికొర- | కిరవైన శాస్త్రంబులెరుక కొరక |
తరి యజ్ఞములు ఋణోత్తారమయ్యెడి కొరకు | సరిలేని దానములు జన్మములకొరకు ||
చ|| మమకారదూరంబు మనసు గెలుచుటకొరకౌ | సమవివేకంబు శాంతములకొరకు |
అమర శ్రీతిరువేంకటాద్రీశు మనసు నీ- | జముగెలుచు బ్రహ్మ విజ్ఞానంబుకొరకు ||
inniyu galuguTEjanmamuna (Raagam: ) (Taalam: )
pa|| inniyu galuguTEjanmamuna naina | jennalara harisEva siddhiMcukoraku ||
ca|| araya vEdAdhyanamadi brahmaSuddhikora- | kiravaina SAstraMbuleruka koraka |
tari yaj~jamulu RuNOttAramayyeDi koraku | sarilEni dAnamulu janmamulakoraku ||
ca|| mamakAradUraMbu manasu gelucuTakorakau | samavivEkaMbu SAMtamulakoraku |
amara SrItiruvEMkaTAdrISu manasu nI- | jamugelucu brahma vij~jAnaMbukoraku ||