ప|| ఇటువలెపో సకలము యించుకగన భావించిన | అటమటములసంతోషము ఆసలుసేయుటలు ||
చ|| పగగొనితిరుగేటిజన్మపుబాధలు తన కేకాలము | తగుసుఖ మెక్కడ నున్నది తడతాకులేకాక |
పొగలోపల సెకగాసిన భుగభుగ గన్నుల నీళ్ళు | నిగిడినదుఃఖమేకాకిలు నిజసౌఖ్యము గలదా ||
చ|| పొలసినమాయపురూపులు పొలతులమచ్చికమాటలు | తలచిన తనకేమున్నది తలపోతలేకాక |
బలుపున బారగ మోహపుపాశము తనమేడ దగిలిన | తలకిందుగ బడుటెల్లను తనకిది ప్రియమౌనా ||
చ|| చేతిపదార్థము దలచక చేరువనుండినవారల- | చేతిపదార్థము గోరిన చేతికి లోనౌనా |
ఆతుమగలవేంకటపతి నాత్మ దలచి సుఖింపక | యేతరిసుఖముల దిరిగిన నింపులు దనకౌనా ||
pa|| iTuvalepO sakalamu yiMcukagana BAviMcina | aTamaTamulasaMtOShamu AsalusEyuTalu ||
ca|| pagagonitirugETijanmapubAdhalu tana kEkAlamu | tagusuKa mekkaDa nunnadi taDatAkulEkAka |
pogalOpala sekagAsina BugaBuga gannula nILLu | nigiDinaduHKamEkAkilu nijasauKyamu galadA ||
ca|| polasinamAyapurUpulu polatulamaccikamATalu | talacina tanakEmunnadi talapOtalEkAka |
balupuna bAraga mOhapupASamu tanamEDa dagilina | talakiMduga baDuTellanu tanakidi priyamaunA ||
ca|| cEtipadArthamu dalacaka cEruvanuMDinavArala- | cEtipadArthamu gOrina cEtiki lOnaunA |
AtumagalavEMkaTapati nAtma dalaci suKiMpaka | yEtarisuKamula dirigina niMpulu danakaunA ||