ప|| ఇటువంటివాడు తాను యెదురాడేనా నేను | చిటుకన జెప్పినట్టు సేసేనే తనకు ||
చ|| వినయము సేసే చోట వెంగెములాడగ రాదు | చనవిచ్చిన చోటును జరయరాదు |
మనసొక్కటైన చోట మంకులు చూపగరాదు | ననువులు గలిగితే నమ్మకుండరాదూ ||
చ|| ప్రియము చెప్పేయప్పుడు బిగిసె ననగరాదు | క్రియగల పొందులు తగ్గించగరాదు |
నయమిచ్చి మాటాడగా నవ్వక మానరాదు | దయతో దగులగాను దాగగరాదు ||
చ|| పచ్చిదేర గూడగాను పంతములుడుగరాదు | కచ్చుపెట్టి చెనకగా గాదనరాదు | ఇచ్చట శ్రీ వేంకటేశుడింతలోనే నన్నుగూడె | మెచ్చి సరస మాడగా మితిమీఱరాదు ||
pa|| iTuvaMTivADu tAnu yedurADEnA nEnu | ciTukana jeppinaTTu sEsEnE tanaku ||
ca|| vinayamu sEsE cOTa veMgemulADaga rAdu | canaviccina cOTunu jarayarAdu |
manasokkaTaina cOTa maMkulu cUpagarAdu | nanuvulu galigitE nammakuMDarAdU ||
ca|| priyamu ceppEyappuDu bigise nanagarAdu | kriyagala poMdulu taggiMcagarAdu |
nayamicci mATADagA navvaka mAnarAdu | dayatO dagulagAnu dAgagarAdu ||
ca|| paccidEra gUDagAnu paMtamuluDugarAdu | kaccupeTTi cenakagA gAdanarAdu |
iccaTa SrI vEMkaTESuDiMtalOnE nannugUDe | mecci sarasa mADagA mitimIrxarAdu ||