ప|| ఇయ్య కొంటి నీపనులు ఇంతా మేలే | చెయ్యి మీదాయ నాకు సిరులేమి బాతి ||
చ|| నయగారి వాడవు నాకు నీవు గలవు | ప్రియములేమి గడమ పెక్కుమారులు |
క్రియ లెఱుగుదువు కేలు చాచేవు నా మీద | నియతాన నిందుకే నీ యాలనైతిని ||
చ|| చలపాది వాడవు సతమై వున్నాడవు | చిలిము యేమి గడమ పై పై నేడు |
వలపించ నేరుతువు వంచేవు నాపై ననుపు | కలకాలమును నీకు గైవశమైతిని ||
చ|| శ్రీ వేంకటేశుడవు చేరి నన్నుగూడితివి | దైవిక మేమి గడమ తగులాయను |
భావమెఱుగుదువు పచ్చిగా నవ్వేవు నాతో | వే వెలకును నీకే వెల్లివిరి యైతిని ||
pa|| iyya koMTi nIpanulu iMtA mElE | ceyyi mIdAya nAku sirulEmi bAti ||
ca|| nayagAri vADavu nAku nIvu galavu | priyamulEmi gaDama pekkumArulu |
kriya lerxuguduvu kElu cAcEvu nA mIda | niyatAna niMdukE nI yAlanaitini ||
ca|| calapAdi vADavu satamai vunnADavu | cilimu yEmi gaDama pai pai nEDu |
valapiMca nErutuvu vaMcEvu nApai nanupu | kalakAlamunu nIku gaivaSamaitini ||
ca|| SrI vEMkaTESuDavu cEri nannugUDitivi | daivika mEmi gaDama tagulAyanu |
BAvamerxuguduvu paccigA navvEvu nAtO | vE velakunu nIkE velliviri yaitini ||