ప|| ఊరకే పోనియ్యరా నన్నుద్దండాన | చేరలంతేసి కన్నుల జెంగలించే విప్పుడు ||
చ|| జూదమాడ బిలిచేవు చూపులనే జంకించేవు | పేదవారి మేన సొమ్ము పెట్టనియ్యవా |
కేదమున నోడి గెలిచితి నంటా నా- | పాదమంటి తీసుకోరా బంగారు మట్టెలు ||
చ|| నెత్తమాడ బిలిచేవు నెఱవాది నంటాను | అత్తమామ గలవార మదేమిరా |
ఒత్తి విన్నవించలేము ఓడితేను నీకు నాకు | రిత్తమాట వద్దు రేఖ రేఖ పందెమా ||
చ|| సొక్కటాలు నిన్ననాడి సోలి సత్యభామకు | మ్రొక్కితివి నేడు నాకు మ్రొక్కవలెగా |
చక్కని వేంకటపతిస్వామి నన్నుంగూడితివి | మొక్కెద కర్పూర తాంబూలమీరా చాలును ||
pa|| UrakE pOniyyarA nannuddaMDAna | cEralaMtEsi kannula jeMgaliMcE vippuDu ||
ca|| jUdamADa bilicEvu cUpulanE jaMkiMcEvu | pEdavAri mEna sommu peTTaniyyavA |
kEdamuna nODi geliciti naMTA nA- | pAdamaMTi tIsukOrA baMgAru maTTelu ||
ca|| nettamADa bilicEvu nerxavAdi naMTAnu | attamAma galavAra madEmirA |
otti vinnaviMcalEmu ODitEnu nIku nAku | rittamATa vaddu rEKa rEKa paMdemA ||
ca|| sokkaTAlu ninnanADi sOli satyaBAmaku | mrokkitivi nEDu nAku mrokkavalegA |
cakkani vEMkaTapatisvAmi nannuMgUDitivi | mokkeda karpUra tAMbUlamIrA cAlunu ||