ప|| ఊరకుండు మనవే వొడబాటులిక నేలే | కోరికలు గోరుకొంటా గొణగే గాని ||
చ|| ఆగపడితిమి తొల్లే ఆయను తన పొందు | యెగసెక్కే లాడక తానిక నెన్నడే |
జగడింప నోపము జవ్వనము మోచుకొని | మొగము చూచి చూచి మూలిగే గాని ||
చ|| సేవలెల్లా జేసేము చెల్లుబడి గలవాడు | యీ వలనవ్వులు నవ్వకిక నెన్నడే |
చేపట్టి తియ్యనేల సిగ్గులుపై వేసుకొని | దేవరంట మొక్కుకొంటా దీవించే గాక ||
చ|| కూడితిమి కౌగిటను గురుతు చన్నుల నంటె | యీడనే ప్రియాలు సేయకిక నెన్నడే |
జోడై శ్రీ వేంకటేశు చుట్టరికపు దనాన | మేడెపు రతులలోన మెచ్చేము గాక ||
pa|| UrakuMDu manavE voDabATulika nElE | kOrikalu gOrukoMTA goNagE gAni ||
ca|| AgapaDitimi tollE Ayanu tana poMdu | yegasekkE lADaka tAnika nennaDE |
jagaDiMpa nOpamu javvanamu mOcukoni | mogamu cUci cUci mUligE gAni ||
ca|| sEvalellA jEsEmu cellubaDi galavADu | yI valanavvulu navvakika nennaDE |
cEpaTTi tiyyanEla siggulupai vEsukoni | dEvaraMTa mokkukoMTA dIviMcE gAka ||
ca|| kUDitimi kaugiTanu gurutu cannula naMTe | yIDanE priyAlu sEyakika nennaDE |
jODai SrI vEMkaTESu cuTTarikapu danAna | mEDepu ratulalOna meccEmu gAka ||