ప|| ఊరకున్న వారితోడ వూరునోప దెఱగవా | చేరినాతో ముద్దులెల్లా జెప్పేవు గాక ||
చ|| వద్దని నీతో నేను వాదులాడిచేనా | గద్దించి యప్పటి నిన్ను గాదనేనా |
తిద్ది నీ గుణాలు నేడు తీరుచ వచ్చేనా | వొద్దనే నీ వెట్టుండినా మంటివి గాక ||
చ|| చలపట్టి నిను నేను సాధించ వచ్చేనా | కలవి లేనివి తారుకాణించేనా |
నిలువుకు నిలువే న్నిను నేరాలెంచేనా | వెలివెంత నవ్వినా నవ్వితివి గాక ||
చ|| పంతమాడి సారెసారె బంగించ దొరకొనేనా | వంతులకు నంతేసి వాసి పట్టేనా |
యింతలో శ్రీవేంకటేశ యెనసితి విటునన్ను | యెంత చనువిచ్చినాను ఇచ్చేవుగాక ||
pa|| Urakunna vAritODa vUrunOpa derxagavA | cErinAtO muddulellA jeppEvu gAka ||
ca|| vaddani nItO nEnu vAdulADicEnA | gaddiMci yappaTi ninnu gAdanEnA |
tiddi nI guNAlu nEDu tIruca vaccEnA | voddanE nI veTTuMDinA maMTivi gAka ||
ca|| calapaTTi ninu nEnu sAdhiMca vaccEnA | kalavi lEnivi tArukANiMcEnA |
niluvuku niluvE nninu nErAleMcEnA | veliveMta navvinA navvitivi gAka ||
ca|| paMtamADi sAresAre baMgiMca dorakonEnA | vaMtulaku naMtEsi vAsi paTTEnA |
yiMtalO SrIvEMkaTESa yenasiti viTunannu | yeMta canuviccinAnu iccEvugAka ||