ప|| ఎక్కడనున్నా నీతడు | దిక్కులు మాదెస దిరిగీగాక ||
చ|| సరసుడు చతురుడు జగదేకగురుడు | పరమాత్ము డఖిలబంధువుడు |
హరి లోకోత్తరు డతడే నామతి | సిరితో బాయక చెలగీగాక ||
చ|| ఉన్నతోన్నతు డుజ్జ్వలు డధికుడు | పన్నగశయనుడు భవహరుడు |
యిన్నిటగలిగిన యిందిరరమణుడు | మన్ననతో మము మనిపీగాక ||
చ|| మమతల నలమేల్మంగకు సంతత- | రమణుడు వేంకటరాయడు |
జమళిసంపదల సరసవిభవముల | తమకంబున మము దనిపీగాక ||
pa|| ekkaDanunnA nItaDu | dikkulu mAdesa dirigIgAka ||
ca|| sarasuDu caturuDu jagadEkaguruDu | paramAtmu DaKilabaMdhuvuDu |
hari lOkOttaru DataDE nAmati | siritO bAyaka celagIgAka ||
ca|| unnatOnnatu Dujjvalu DadhikuDu | pannagaSayanuDu BavaharuDu |
yinniTagaligina yiMdiraramaNuDu | mannanatO mamu manipIgAka ||
ca|| mamatala nalamElmaMgaku saMtata- | ramaNuDu vEMkaTarAyaDu |
jamaLisaMpadala sarasaviBavamula | tamakaMbuna mamu danipIgAka ||