ప|| ఎక్కడా నెఱుగమమ్మ యిటువంటి బత్తి | చిక్కంచే దెటువలెనే చేతిలోనికతని ||
చ|| మనసు నొచ్చీనంటా మాటలాడ వెరచేవు | చెనకే దెటువలెనే చెలువునిని |
వనితరో పతి కొప్పొ వంగీనంటూ లోగేవు | పెనగే దెటువలెనే ప్రియమైన వేళను ||
చ|| వెంగెమవునో యనుచును వెస నవ్వజాల్వు | సంగతయ్యే దెటులనే సరసములు |
యెంగిలయ్యీ నంటామోవి యించుకంతా నడుగవు | ముంగిట రతులనింక ముందెటువలెనే ||
చ|| సిగ్గువడీనో యంటా చెరగుపట్టి తియ్యపు | వెగ్గళించే దెట్టే శ్రీ వేంకటేశుని |
యెగ్గు వట్టీనోయంటా నిట్టెగోరు దాకించేవు | వొగ్గి కూడితివి యిట్టే వుబ్బుతెలిసే దెట్టే ||
pa|| ekkaDA nerxugamamma yiTuvaMTi batti | cikkaMcE deTuvalenE cEtilOnikatani ||
ca|| manasu noccInaMTA mATalADa veracEvu | cenakE deTuvalenE celuvunini |
vanitarO pati koppo vaMgInaMTU lOgEvu | penagE deTuvalenE priyamaina vELanu ||
ca|| veMgemavunO yanucunu vesa navvajAlvu | saMgatayyE deTulanE sarasamulu |
yeMgilayyI naMTAmOvi yiMcukaMtA naDugavu | muMgiTa ratulaniMka muMdeTuvalenE ||
ca|| sigguvaDInO yaMTA ceragupaTTi tiyyapu | veggaLiMcE deTTE SrI vEMkaTESuni |
yeggu vaTTInOyaMTA niTTegOru dAkiMcEvu | voggi kUDitivi yiTTE vubbutelisE deTTE ||