ప|| ఎక్కడి పాపము లెక్కడి పుణ్యము- | లొక్కట గెలిచితి మోహో నేము ||
చ|| ప్రపన్నులెదుటను బడినయాతుమకు | చపలత మరి నాశము లేదు |
ఉపమల గురుకృపనొనరిన మనసుకు | రపముల మరి నేరములే లేవు ||
చ|| ఘనతరద్వయాధికారగు దేహికి | మినుకుల భవభయమే లేదు |
చనువుల హరిలాంఛన కాయమునకు | వెనుకొను కర్మపువెట్టియు లేదు ||
చ|| శ్రీవేంకటేశ్వరు జేరిన ధర్మికి | ఆవల మరి మాయలు లేవు |
కైవశమాయను కైవల్య పదమును | జావు ముదిమితో నడ్డే లేదు ||
pa|| ekkaDi pApamu lekkaDi puNyamu- | lokkaTa geliciti mOhO nEmu ||
ca|| prapannuleduTanu baDinayAtumaku | capalata mari nASamu lEdu |
upamala gurukRupanonarina manasuku | rapamula mari nEramulE lEvu ||
ca|| GanataradvayAdhikAragu dEhiki | minukula BavaBayamE lEdu |
canuvula harilAMCana kAyamunaku | venukonu karmapuveTTiyu lEdu ||
ca|| SrIvEMkaTESvaru jErina dharmiki | Avala mari mAyalu lEvu |
kaivaSamAyanu kaivalya padamunu | jAvu mudimitO naDDE lEdu ||