ప|| ఎక్కడి నరకము ఎక్కడిమృత్యువు మాకు | దక్కి నీదివ్య నామామృతము చూరగొంటిమి ||
చ|| తమితో శ్రీపతి దాసుల చేరినప్పుడే | యమ కింకర భయము లణగి పోయె |
జమళి నీ యాయుధ లాంఛనము మోచినప్పుడే | అమర కాలదండము లవియెల్ల బొలిసె ||
చ|| మును నీ నగరిత్రోవ మొగమైన యప్పుడే | ఘన యామ్య మార్గము కట్టువడియె |
ఒనర నీ తిరుపతి నొకరాత్రి వున్నపుడే | కనలు కాలసూత్రాది ఘాతలెల్ల పూడె ||
చ|| యెడరై నీమంత్రజపము యెంచుకొన్న యపుడే | కడు చిత్రగుప్తుని లెక్కలుగ చే- |
వడిగా వేంకటేశ్వర మీశరణమనగ | అడరి వైకుంఠము మా యరచేత నిలిచె||
pa|| ekkaDi narakamu ekkaDimRutyuvu mAku | dakki nIdivya nAmAmRutamu cUragoMTimi ||
ca|| tamitO SrIpati dAsula cErinappuDE | yama kiMkara Bayamu laNagi pOye |
jamaLi nI yAyudha lAMCanamu mOcinappuDE | amara kAladaMDamu laviyella bolise ||
ca|| munu nI nagaritrOva mogamaina yappuDE | Gana yAmya mArgamu kaTTuvaDiye |
onara nI tirupati nokarAtri vunnapuDE | kanalu kAlasUtrAdi GAtalella pUDe ||
ca|| yeDarai nImaMtrajapamu yeMcukonna yapuDE | kaDu citraguptuni lekkaluga cE- |
vaDigA vEMkaTESvara mISaraNamanaga | aDari vaikuMThamu mA yaracEta nilice||