ప|| ఎక్కడిదురవస్థ లేటిదేహము లోన | జిక్కి జీవుడు మోక్షసిరి జెందలేడు ||
చ|| ఒడలు మాంసపూర మొక పూటయిన మీదు | గడుగకున్న గొరగాదు |
కడలేనిమలమూత్రగర్హితమిది, లోను | గడుగరాదు యెంతగడిగిన బోదు ||
చ|| అలర చిత్తముచూడ నతిచంచలము దీన | గలసిన పెనుగాలి గనము |
మెలపులేనిచిచ్చు మీదమిక్కిలి గొంత | నిలుపులేదు పట్టి నిలుపగరాదు ||
చ|| తిరువేంకటాచలాధిపుడు నిత్యానంద- | కరుడు జీవునకు రక్షకుడు |
కరుణించి యొకవేళ గాచినగాని మేను- | చొరకమానెడుబుద్ధి చోక దెవ్వరికి ||
pa|| ekkaDiduravastha lETidEhamu lOna | jikki jIvuDu mOkShasiri jeMdalEDu ||
ca|| oDalu mAMsapUra moka pUTayina mIdu | gaDugakunna goragAdu |
kaDalEnimalamUtragarhitamidi, lOnu | gaDugarAdu yeMtagaDigina bOdu ||
ca|| alara cittamucUDa naticaMcalamu dIna | galasina penugAli ganamu |
melapulEniciccu mIdamikkili goMta | nilupulEdu paTTi nilupagarAdu ||
ca|| tiruvEMkaTAcalAdhipuDu nityAnaMda- | karuDu jIvunaku rakShakuDu |
karuNiMci yokavELa gAcinagAni mEnu- | corakamAneDubuddhi cOka devvariki ||