ప|| ఎక్కడిమతము లింక నేమి సోదించేము నేము | తక్కక శ్రీపతి నీవే దయజూతుగాక ||
చ|| కాదనగ నెట్టవచ్చు కన్నులెదుటి లోకము | లేదనగ నట్టవచ్చు లీలకర్మము |
నీదాసుడ ననుచు నీమరుగు చొచ్చుకొంటే | యేదెసనైనా బెట్టి యీడేరింతుగాక ||
చ|| తోయ నెట్టవచ్చు మించి తొలకేటి నీమాయ | పాయనెట్టవచ్చు యీభవబంధాలు |
చేయూర నిన్ను బూజించి చేరి నీముద్రలు మోచి | యీయెడ నీవే యీడేరింతుగాక ||
చ|| తెలియగ నెట్టవచ్చు ద్రిష్టమైననీమహిమ | తలచగ నెట్టవచ్చు తగునీరూపు |
నెలవై శ్రీవేంకటేశ నీవు గలవనుండగా | యిలమీద మమ్ము నీవే యీడేరింతుగాక ||
pa|| ekkaDimatamu liMka nEmi sOdiMcEmu nEmu | takkaka SrIpati nIvE dayajUtugAka ||
ca|| kAdanaga neTTavaccu kannuleduTi lOkamu | lEdanaga naTTavaccu lIlakarmamu |
nIdAsuDa nanucu nImarugu coccukoMTE | yEdesanainA beTTi yIDEriMtugAka ||
ca|| tOya neTTavaccu miMci tolakETi nImAya | pAyaneTTavaccu yIBavabaMdhAlu |
cEyUra ninnu bUjiMci cEri nImudralu mOci | yIyeDa nIvE yIDEriMtugAka ||
ca|| teliyaga neTTavaccu driShTamainanImahima | talacaga neTTavaccu tagunIrUpu |
nelavai SrIvEMkaTESa nIvu galavanuMDagA | yilamIda mammu nIvE yIDEriMtugAka ||